తెలంగాణా గవర్నమెంట్ పెంచిన పెన్షన్ నవంబర్ 10 నుండి ఇవ్వడానికి సిద్దం అయింది ఇది చాలా సంతోషించే విషయం
పెన్షన్ సెలక్షన్ విషయం లో చాల కటిన నిర్ణయాలే చెప్పవచు ప్రతి ఇంటికి వచ్చి ఎంక్వయిరీ చేసి ఎలాంటి లొసుగులు లేకుండా సెలక్షన్ జరిగింది అనే చెప్పవచు
కాని పెన్షన్ మార్గాదర్శకాలే అసంబద్దం గా వున్నాయి దేనిని బేస్ చేసుకుని అర్హులు గా నిర్ణయించారో పెన్షన్ కి అప్లై చేసుకున్న వాళ్లకి తెలిదు కనీసం అర్హులు గా గుర్తించిన వాళ్ళని ఐనా వెంటనే చెప్పకుండా వెళ్ళడం వల్ల వాళ్లకి వస్తుందో రాదో తెలీని పరిస్తితిలో వుండిపోయారు కనీసం వచ్చిన వాళ్ళ పేర్లు అయినా తెల్లవారి తహశీల్దారు కార్యాలయం లో లిస్టు వేసి ఉండవలసింది
అలా చేయక పోవడం వల్ల పెన్షన్ కి అర్హుల జాబితా ని గ్రామ పంచాయితీ లకి పంపారు దీన్ని అలుసుగా తీసుకున్న
VRA and VRO's వాళ్లకి మాత్రమె పెన్షన్ అర్హుల జాబితా వాళ్లకి మాత్రమె తెలుసు కనుక అందులో వున్న వాలని సంప్రదించి మీకు పెన్షన్ వచ్చేలా చేస్తాం అని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు
వాళ్ళ పేర్లు పెన్షన్ లిస్టు లో వున్నాయి అని తెలియక డబ్బులు ఇస్తున్నారు డబ్బులు ఇవ్వకపోతే ఎక్కడ వాళ్ళ పెన్షన్ రాదో అని బయపడి అంతకుముందే పెన్షన్ కి అర్హులం అయ్యాము అని తెలియక డబ్బులు ఇస్తునారు
కనిసం పెన్షన్ కి అర్హత పొందిన వాళ్ళ జాబితా తహశిల్దార్ కార్యాలయం లో లిస్టు వేసి వుంటే గ్రామ పంచాయితీ లో వుండే VRA and VRO లాంటి వాళ్లకి ఇలాంటి అవకాశం వుండేది కాదు
ముసలి వయసులో పెన్షన్ అర్హులకి డబ్బులు చెల్లించే బడ వుండేది కాదు
No comments:
Post a Comment